-->
 
ఆయిల్ పామ్ చరిత్ర

history_oilpalm_img

ఆయిల్ పామ్ (ఏలిస్ గైనెన్సిస్) పశ్చిమ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన వంట నూనెను  ఇచ్చే చెట్టు దీనినే ఆఫ్రికన్ ఆయిల్ పామ్ లేదా ఎర్ర ఆయిల్ పామ్ అంటారు.

15వ శతాబ్దములో యూరోపియన్లు చేత ఆఫ్రికాలో కనుగొనబడి ఇది ప్రపంచములోని  ఇతర దేశాలకు పరిచయం చేయబడినది. 1846 సంవత్సరములో  గల ‘బొగొర్ బోటానికల్ గార్డెన్” లో అలంకరణ నిమిత్తం నాటబడిన  నాలుగు ఆయిల్ పామ్ మొక్కలే  ఆసియా ఖండపు  ఆయిల్ పామ్ మొక్కలకు తల్లి చెట్టుగా వున్నవి.

5 దశాబ్దాలలోనే మలేషియా, ఇండోనేషియా దేశాలు ప్రపంచములోనే  అత్యధిక పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలుగా అభివృద్ది  చెందినవి. ఈ రెండు దేశాలు 1912-1917 మధ్య కాలంలోనే  ఆయిల్ పామ్ పంటను వాణిజ్యపరంగా చేపట్టాయి.
1980 తర్వాత ఆయిల్ పామ్ అభివృద్థి వేగవంతమయ్యి ప్రపంచంలో ప్రస్తుతం 100 మిలియన్ టన్నుల నూనెను ఉత్పత్తి చేస్తున్నది. దీనిలో 48.95 మి.ట ఇండోనేషియా, 36.

19  మి.ట మలేషియా మిగిలినది ఇతర దేశాలలో ఉత్పత్తి అవుతుంది. మొట్ట మొదటి భారత ప్రభుత్వం ద్వారా ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో డిపార్ట్ మెంట్ అఫ్ బయో టెక్నాలజీ వారిచే 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ ప్రదర్శన  క్షేత్రాలను ఏర్పాటు చేయడం జరిగినది.

తదుపరి టెక్నాలజీ మిషన్ ఆన్ ఆయిల్ సీడ్స్ అండ్ పల్సెస్  వారి ఆధ్వర్యములో 9వ  పంచవర్ష ప్రణాళిక (1991-1992) లో ఆయిల్ పామ్ అభివృద్థి  పథకం ద్వారా, తదుపరి 2004-2005 నుండి ఐయస్ఒపిఒయం  పథకం ద్వారా, అలాగే 2011-12 నుండి ఆర్.కె.వి.వై పథకం ద్వారా ఆయిల్ పామ్ విస్తరణను వ్యవసాయ  సహకార మంత్రిత్వ శాఖా, భారత ప్రభుత్వం వారిచే చేపట్టడం జరిగినది. దీని ద్వారా రాబోయే 5 సంవత్సరాల  కాలంలో  పామ్ ఆయిల్ ఉత్పత్తి  2.5 నుండి 3.0 లక్షల టన్నుల లక్ష్యం చేరుకోవాల్ని ప్రతిపాదించినారు.